అసెంబ్లీలో నాగం, మోత్కుపల్లి, ఎర్రబెల్లి మాటా మాట

మోత్కుపల్లి, ఎర్రబెల్లి టిడిఎల్పీలోకి వెళుతూ నాగంను ఆహ్వానించారు. అయితే ఆయన లోనికి వెళ్లకుండా గేటు బయటే నిల్చుని తాను తెలంగాణ విషయంలోనే టిడిపితో విభేదించానని, తాను చంద్రబాబుకు గానీ, టిడిపికి గానీ వ్యతిరేకం కాదన్నారు. దీనికి మోత్కుపల్లి, ఎర్రబెల్లిలు పదేళ్ల క్రితం నీవు తెలంగాణ అంటే మొనగాడివయ్యే వాడివన్నారు. అప్పుడు నాగం, 2004 వరకు టిడిపిది సమైక్యవాదం అని పార్టీకి కట్టుబడి తాను ఉన్నానని కానీ గత ఎన్నికల్లో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకొని వెనక్కి పోయిందన్నారు. దీనికి వారు ఎప్పుడూ టిడిపి గురించి కాకుండా కాస్త తెలంగాణ గురించి కూడా మాట్లాడాలని సూచించారు. నాగం పార్టీ వీడాక ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకోవడంతో ఇప్పుడు వీరి మధ్య సామరస్య పూర్వకంగా చర్చ జరగటం ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications