ఆత్మ కాంగ్రెసులోనే: పార్టీ వీడిన ఎమ్మెల్యేలపై శంకరరావు

ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడినంత మాత్రాన ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదని ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హైదరాబాదులో అన్నారు. అవిశ్వాస తీర్మానం పెడితే అసెంబ్లీలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తమ మెజార్టీ నిరూపించుకుంటుందన్నారు. శాసనసభలో ముఖ్యమంత్రి ప్రకటన మేరకు భూకేటాయింపులపై సభాసంఘాన్ని త్వరలోనే వేస్తామని ఆయన చెప్పారు. కాగా ఆనం శాసనసభ సమావేశాల నిర్వహణ, భూముల కేటాయింపుపై సభాసంఘం తదితర విషయాలపై చర్చించేందుకు అన్ని పార్టీల శాసనసభా పక్ష నేతలతో స్పీకర్ నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. భేటీ అనంతరం ఆనం మీడియాతో మాట్లాడారు.












Click it and Unblock the Notifications