మీరు సమర్థులు కాదు?: బాబుకి షాకిచ్చిన విద్యార్థి

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పార్టీని డిసిప్లేన్‌గా ఉంచే వారని మీరు మాత్రం అలా సమర్థంగా పార్టీని నడపలేక పోయారనేది తన అభిప్రాయమన్నారు. అందుకు వైయస్ ముఖ్యమంత్రి కాకముందు ఆయనను పట్టించుకున్న వారు లేరని కానీ ఆయన సిఎం అయ్యాక అందరికీ డబ్బులు ఎరచూపి అదుపులో పెట్టుకున్నారని, ఆయన కూడా లక్షల కోట్లు సంపాదించుకున్నారని, ఇప్పుడు అందుకు తగిన ఫలితం అనుభవిస్తున్నారని బాబు సమాధానమిచ్చారు.
అదే విద్యార్థి మాట్లాడుతూ మీరు మీ రాజకీయ జీవితంలో ఎప్పుడు అక్రమాలకు పాల్పడలేదా అని ప్రశ్నించారు. దానికి బాబు సమాధానమిస్తూ... తాను తన 32 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ అక్రమాలకు పాల్పడలేదన్నారు. దేశంలో ఏ రాజకీయ నాయకుడు ప్రకటించనట్లుగా కుటుంబ ఆస్తులను తాను ప్రకటించానన్నారు. తాను ప్రకటించిన ఆస్తులు కాకుండా ఇతర ఆస్తులు తనకున్నట్లు చూపిస్తే తాను వారికే వాటిని రాసివ్వడానికి ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నానని మరోసారి సవాల్ విసిరారు. మీ విద్యార్థులెవరైనా చూపించినా మీరు రాసివ్వడానికి సిద్ధమన్నారు.












Click it and Unblock the Notifications