హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏం జరిగినా వైయస్ జగన్ హస్తమే: అంబటి రాంబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ambati Rambabu
హైదరాబాద్: రాష్ట్రంలో రాజకీయంగా ఏం జరిగినా అందులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి హస్తమే ఉంటుందని తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీ భావిస్తుంటాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మంగళవారం ధ్వజమెత్తారు. జగన్ అంటే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు భయమని అందుకే ఆయన కాంగ్రెసుతో చేతులు కలిపారన్నారు. ఎన్నికలొస్తే తమకు డిపాజిట్ కూడా దక్కదని కాంగ్రెసు, టిడిపిలకు గత కడప ఉప ఎన్నికలలో అర్థమైందన్నారు. అందుకే టిడిపి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టకుండా కాంగ్రెసుకు సహకరిస్తోందన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితితో తమకు ఎలాంటి అవగాహన లేదని, ఉండాల్సిన అవసరం కూడా లేదన్నారు. టిఆర్ఎస్, తాము కాంగ్రెసు వ్యతిరేకులం కాబట్టి మేం ఒకరిపై ఒకరం విమర్శలు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. టిఆర్ఎస్‌లో చేరిన ముగ్గురు శాసనసభ్యులు మూర్ఖులని కొందరంటున్నారని కానీ కాంగ్రెసులో ఉన్న వారే అసలైన మూర్ఖులన్నారు.

English summary
YSRC Party spokes person Ambati Rambabu accused today that TDP and Congress is saying Jaganmohan Reddy is responsible for all.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X