హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీమాంధ్రలోనూ ఉందా?: వలసలపై సిఎం తర్జన భర్జన

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు, శాసనసభ్యుడు రాజయ్య, అనుబంధ శాసనసభ్యుడు సోమారపు సత్యనారాయణ కాంగ్రెసు పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరడంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వలసలపై దృష్టి సారించినట్లుగా కనిపిస్తోంది. రెండు పర్యాయాలుగా టిడిపి విపక్షంలో కూర్చుండటానికి తోడు తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉండటంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు టీఅర్ఎస్‌లో చేరారు. కానీ అధికార పక్షంలో ఉన్న ముగ్గురు శాసనసభ్యులు టిఆర్ఎస్‌లో చేరడాన్ని సిఎం జీర్ణించుకోలేక పోతున్నట్లుగా తెలుస్తోంది. అధికారంలో ఉన్న కాంగ్రెసును కాదనుకొని ఇతర పార్టీలలోకి వెళ్లడంపై సిఎం విశ్లేషించే పనిలో పడ్డారట.

జిల్లాల వారీగా ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించి వారిలోని భావాలను అర్థం చేసుకునే పనిని ఇంఛార్జ్ మంత్రులకు సిఎం అప్పగించారని సమాచారం. వెళ్లిన వారు తెలంగాణ సెంటిమెంట్‌తోనే వెళ్లారా? లేక మరేదైనా కారణం ఉందా? అన్న కోణంపై ఆయన దృష్టి సారిస్తున్నారట. ఇందుకోసం ఆయన ఇంటెలిజన్స్ వర్గాల నివేదికలు కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వీటన్నింటి ఆధారంగా ఎమ్మెల్యేలకు, మంత్రులకు మధ్య, శాసనసభ్యులకు తనకు మధ్య గ్యాప్ తగ్గించుకోవాలని చూస్తున్నారట. అలాగే అసంతృప్తి కేవలం తెలంగాణకే పరిమితమైందా? లేకా సీమాంధ్రలో కూడా ఉందా? అనే అంశంపై దృష్టి సారించారట.

English summary
It seems, CM Kiran Kumar Reddy was shocked by mlas Jupalli Krishna Rao, Somarapu Satyanarayana and Rajaiah. Now he is concentrating on other MLAs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X