జగన్‌లాగే కెసిఆర్ వేల కోట్లు: కాంగ్రెసు ఎమ్మెల్యేలు

తాము కోటి రూపాయలు తీసుకుంటే తెరాసలో చేరడానికి జూపల్లి కృష్ణారావు కేసిఆర్ వద్ద ఎన్ని కోట్ల రూపాయలు తీసుకున్నారని వారు ప్రశ్నించారు. తెలంగాణ కోసమే అయితే కెసిఆర్ కొండా లక్ష్మణ్ బాపూజీ దీక్షకు కెసిఆర్ ఎందుకు మద్దతివ్వలేదని వారు అడిగారు. కొండా లక్ష్మణ్ బాపూజీ దీక్షకు మద్దతివ్వకుండా మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీక్షకు మద్దతు ప్రకటించి కెసిఆర్ బిసి వ్యతిరేకతను చాటుకున్నారని వారు విమర్శించారు.
బడుగు, దళిత, గిరిజన శాసనసభ్యుల ఆత్మగౌరవం దెబ్బ తినేలా జూపల్లి వ్యాఖ్యలు చేస్తున్నారని బాలూ నాయక్ విమర్శించారు. కండువా మార్చేందుకు జూపల్లి ఎన్నికోట్లు తీసుకున్నారని ప్రతాప రెడ్డి ప్రశ్నించారు. కెసిఆర్ ఆస్తులపై విచారణ జరిపించాలని తాము ప్రభుత్వాన్ని కోరుతామని కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications