పూటకొకరితో కెసిఆర్ సంసారం: పొత్తులపై జగ్గారెడ్డి

తెలంగాణ కోసం ఉద్యమించేందుకు త్వరలో కాంగ్రెసు తెలంగాణ యాక్షన్ ఫోరం ఏర్పాటు చేస్తామని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర రెడ్డి నల్గొండ జిల్లాలో అన్నారు. టిఆర్ఎస్ తన రాజకీయ లబ్ధి కోసమే వలసలను ప్రోత్సహిస్తోందని విమర్శించారు. పదకొండేళ్లుగా టిఆర్ఎస్ సాధించిందేమిటో చెప్పాలన్నారు. రాజకీయ ప్రక్రియ ద్వారానే తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. సకల జనుల సమ్మె వల్ల తెలంగాణ ప్రజలే నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలోనే ఉంటూ కొందరు టిఆర్ఎస్‌తో రహస్య ఒప్పందం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము ఎవరికీ లేదన్నారు. ఆయన సూర్యాపేటలో నల్ల చొక్కా ధరించి జాతీయ జెండా ఎగుర వేశారు.












Click it and Unblock the Notifications