వదిలేసిన దాని కోసం సిఎం చుట్టూ: ఎంపీ కోమటిరెడ్డి

తెలంగాణ ప్రాంత మంత్రులు వెంటనే తమ పదవులకు రాజీనామాలు చేయాలని ఎంపీ వివేక్ డిమాండ్ చేశారు. రెండు రోజుల్లో తన కుమార్తె వివాహం అని తెలిసినప్పటికీ పోలీసులు రైలు రోకోలో పాల్గొన్న తనను అరెస్టు చేశారని ధ్వజమెత్తారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు పదవుల పేరుతో ఉద్యమాన్ని అణిచి వేసేందుకు కుట్ర చేస్తున్నారని తెలంగాణ నేతలు అందులో భాగస్వాములు కావద్దని కోరారు. వెన్నుపోట్లతో తెలంగాణ రాదని సీనియర్ నేత కె కేశవ రావు మీడియాతో అన్నారు. కాంగ్రెసు పార్టీ జెండాతోనే తెలంగాణ సాధ్యమన్నారు. కేంద్ర మంత్రి చిదంబరం మాటలతో తనలో ధైర్యం పెరిగిందన్నారు. అధిష్టానంతో తాను మాట్లాడానని చెప్పారు. కాగా ఎంపీలు పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు కోమటిరెడ్డి దీక్షలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications