ఊసరవెల్లి ముదిరితే చంద్రబాబు: కెటిఆర్ వ్యాఖ్య

KT Rama Rao
కరీంనగర్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు కెటి రామారావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుందని, ఊసరవెల్లి ముదిరితే చంద్రబాబు అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు తమపై, తమ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్‌పై చేస్తున్న ఆరోపణలపై తాను బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన మంగళవారం తెలిపారు. ఎవరి నీతి ఏమిటో తేల్చుకునేందుకు కెసిఆర్ సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు.

ప్రభుత్వం ఈ నెల 2వ తేదీ నుంచి తలపెట్టిన రచ్చబండ కార్యక్రమాన్ని తెలంగాణ మంత్రులు బహిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. రచ్చబండను బహిష్కరించకపోతే వారి నియోజకవర్గాల్లో వారి నిర్వాకాన్ని ప్రజల ముందు ఎండగడుతామని ఆయన హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో కలిసి రాకపోతే తెలంగాణ మంత్రుల ఇళ్లను దిగ్బంధం చేస్తామని ఆయన అన్నారు. దొంగల్లా విధులు నిర్వహిస్తూ తెలంగాణ ప్రాంత మంత్రులు గబ్బిలాల్లా పదవులు పట్టుకుని వేలాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇతర పార్టీల నాయకులను తెరాస ప్రలోభ పెడుతుందని అంటున్న మంత్రి శ్రీధర్ బాబు ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+