వేదికపైకెక్కి ఎమ్మెల్యే హంగామా, సొమ్మసిల్లిన దాస్యం

Dasyam Vinay Bhaskar
హైదరాబాద్/వరంగల్: వరంగల్ జిల్లా తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యుడు దాస్యం వినయ భాస్కర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలలో హల్ చల్ సృష్టించారు. వరంగల్ పట్టణంలో జరుగుతున్న అవతరణ వేడుకలను ఆయన అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. వేడుకలు జరుగుతున్న వేదిక పైకి ఎక్కి అడ్డుకునే యత్నాలు చేశారు. అక్కడే ఉన్న ఫ్లెక్సీని ఆయన చించి వేశారు. పోలీసులు ఆయనను అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. దీంతో పోలీసులకు, దాస్యంకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. తోపులాట సందర్భంగా ఆయన సొమ్మసిల్లి పడిపోయారు.

కాగా కూకట్‌పల్లిలోని జెఎన్‌టియు కళాశాలలో తెలంగాణ జెఏసి నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపింది. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని విద్రోహదినంగా ప్రకటిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు ఆర్ట్స్ కళాశాల నుండి గన్ పార్కు వద్దకు మహా ర్యాలీ నిర్వహించారు. చేతులకు సంకెళ్లు వేసుకొని వినూత్న నిరసన తెలిపారు. ఎబివిపి ఆధ్వర్యంలో కూడా ప్రతిజ్ఞా దివస్ నిర్వహించారు. మరికొందరు విద్యార్థులు ఢిల్లీలో దీక్ష చేపడుతున్న కొండా లక్ష్మణ్ బాపూజీ దీక్షకు మద్దతుగా ఓయులో దీక్ష చేపట్టారు. కాగా పోలీసుల ర్యాలీని అడ్డుకోవడానికి భారీ స్థాయిలో పోలీసులు ఎన్‌సిసి గేటు వద్ద సిద్ధంగా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+