గుండెలపై తన్నిన బాలయ్యకు బుద్ధి చెబుతారు: కర్నె

చంద్రబాబు చరిత్ర తెలియని అజ్ఞాని అని టిఆర్ఎస్ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రవణ్ కుమార్ మండిపడ్డారు. బాబుకు చరిత్ర పుస్తకాలు పంపిస్తామని చదువుకోవాలని హితవు పలికారు. 2009 తర్వాత దేవేందర్ గౌడ్, పెద్దిరెడ్డిలను టిడిపిలో చేర్చుకున్నప్పుడు బాబుకు వలసల గురించి గుర్తుకు రాలేదా అన్నారు. బాబు వలసల గురించి మాట్లాడుతే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు. ప్రజల ధనంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలు జోగు రామన్న, వినయ భాస్కర్‌పై పోలీసుల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు.












Click it and Unblock the Notifications