బాబు దొంగల నేత, బాలయ్యను అంటాం: పొన్నం

స్పష్టమైన వైఖరి చెప్పాలంటే కాంగ్రెసు చెప్పిందా అని తెలుగుదేశం నాయకులు అంటున్నారని, అది సరైంది కాదని ఆయన అన్నారు. తెలంగాణ ఇస్తే తాము పూర్తి సహకారం ఇస్తామని అఖిల పక్ష సమావేశంలో తెలుగుదేశం పార్టీ చెప్పిందని ఆయన అన్నారు. ఎన్నేళ్లు కలిసి ఉన్నామనేది ముఖ్యం కాదని, తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు గత నిర్ణయానికి కట్టుబడి ఉంటారా, మార్చుకుంటారా అనే విషయం చెప్పాలని ఆయన అన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఆయన విరుచుకుపడ్డారు. ఏ పదవీ చేయని కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి ఎలా తెచ్చుకున్నారో చెప్తే తాము తెలంగాణను తెచ్చుకుంటామని ఆయన అన్నారు. కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు తెరాసలో చేరుతారని అనుకున్నట్లు లగడపాటి రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. లగడపాటి నాలుక తెగ కోస్తామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications