గాలి గతే వైయస్ జగన్‌కు పడుతుంది: చంద్రబాబు

తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో తనకు ఒక్కటంటే ఒక్క ఇల్లు ఉంటే జగన్‌కు అధునాతమైన గృహనిర్మాణాల సముదాయం ఉందని అన్నారు. అవినీతి మార్గంలో ప్రజాధనాన్ని కొల్లగొట్టి జగన్ జల్సా చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. 30 ఎకరాల్లో ఇల్లు కట్టుకున్నవారిని ఎక్కడైనా చూశారా అని ఆయన ప్రశ్నించారు. వందల వేలకోట్ల రూపాయలు కొల్లగొట్టిన గాలి జనార్థన్ రెడ్డికి ఎలా జైలు గతి పట్టిందో, అలాగే వైఎస్ జగన్‌కు కూడా త్వరలో అదే గతి పడుతుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో అవినీతికి పాల్పడినవారిపై తమ పార్టీ పోరాటం చేస్తుందని, దోషులను ప్రజల ముందు నిలబెట్టేవరకూ విశ్రమించదని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వానికి కుర్చీని కాపాడుకునేందుకే సమయం సరిపోతోందనీ, రైతుల గోడును పట్టించుకునే పరిస్థితే లేదన్నారు. రైతులకు న్యాయం చేసేలా ప్రభుత్వం మెడలు వంచుతామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications