పోరాడితే ఎదురుదాడి, తప్పుడు ప్రచారం: దేవేందర్

Devender Goud
హైదరాబాద్: రైతు సమస్యలు పరిష్కరించాలని తాము కోరుతుంటే అధికార కాంగ్రెసు పార్టీ నాయకులు ఎదురు దాడికి దిగుతున్నారని తెలుగుదేశం పార్టీ నాయకుడు టి. దేవేందర్ గౌడ్ విమర్శించారు. ప్రతిపక్షంగా తాము లేవనెత్తిన సమస్యలను పరిష్కరంచడానికి ప్రయత్నించకుండా కాంగ్రెసు పార్టీ నాయకులు ఎదురు దాడికి దిగుతూ సమస్యలను పక్కదోవ పట్టిస్తున్నారని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం లక్షలాది మంది రైతులను పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. రైతు పోరు బాటలో భాగంగా పాదయాత్ర చేస్తున్న తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కాంగ్రెసు నాయకులు విమర్శించడాన్ని ఆయన తప్పు పట్టారు. చంద్రబాబు కొత్తగా పాదయాత్ర చేస్తున్నట్లు మాట్లాడుతున్నారని ఆయన అంటూ గత రెండేళ్లలో రైతు సమస్యలపై చంద్రబాబు చేపట్టిన కార్యక్రమాలను వివరించారు.

వ్యవసాయం దండుగ అని చంద్రబాబు అన్నట్లు కాంగ్రెసు నాయకులు చెప్పడాన్ని ఆయన వ్యతిరేకించారు. అనని మాటలు చంద్రబాబు అన్నట్లు చెబుతున్నారని, వాటిని ప్రచారంలో పెడుతున్నారని ఆయన అన్నారు. వ్యవసాయాన్ని పట్టించుకోకపోతే ఆహార భద్రతకు ముప్పు వస్తుందని ఆయన అన్నారు. వ్యవసాయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆయన విమర్శంచారు. రైతు సమస్యలను ప్రభుత్వ దృష్టికి తేవడానికి చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నారని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. కొన్ని ప్రతిపక్షాలు కూడా ప్రతిపక్షంగా ఉన్న తమ పార్టీపై విమర్శలు చేస్తున్నాయని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+