సీమాంధ్ర అధికారులు నన్నుచాలా వేధించారు: నళిని

గతంలో ప్రకటించినట్లు డిసెంబర్ 9వ తేదిలోపు కేంద్రం తెలంగాణ ఇవ్వకుంటే న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తానని ప్రకటించారు. తనకు ఉద్యోగం చేయాలని ఉన్నప్పటికీ పరిస్థితులు అందుకు అనుకూలించడం లేదన్నారు. తెలంగాణపై ప్రభుత్వం వైఖరికి నిరసనగానే తాను రాజీనామా చేశానన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం అన్ని సంఘాలతో కలిసి ఉద్యమంలో పాల్గొంటానన్నారు. సాధారణ మహిళగానే ఉద్యమిస్తానన్నారు. తెలంగాణ వచ్చే వరకు తాను ఉద్యోగంలో చేరే ప్రసక్తి లేదన్నారు. కాగా తెలంగాణ కోసం నళిని గతంలోనూ రాజీనామా చేశారు.












Click it and Unblock the Notifications