వైయస్ జగన్ అరెస్టు అవుతారనేది ఊహాగానమేనా?

వైయస్ జగన్మోహన్ రెడ్డిని సిబిఐ అధికారులు శుక్రవారం తమ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జగన్‌ను విచారించేందుకు ఢిల్లీ నుంచి సిబిఐ ప్రత్యేక బృందం హైదరాబాదు చేరుకున్నారు. జగన్‌ను విచారించేందుకు సిబిఐ దాదాపు వంద ప్రశ్నలను రూపొందించినట్లు తెలుస్తోంది. సాక్ష్యం చేప్పేసి వచ్చేస్తారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు అంటున్నారు. అయితే, సిబిఐ వేసే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే విషయం అంత సులభంగా ఉండదని అంటున్నారు.
కాగా, జగన్‌ను అరెస్టు చేయకపోయినప్పటికీ గాలి జనార్దన్ రెడ్డి కేసులో, ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో సిబిఐ అధికారులు వైయస్ జగన్‌ను విచారణ నిమిత్తం పదే పదే పిలిచే అవకాశాలున్నాయని అంటున్నారు. పలు విడతలుగా విచారించిన తర్వాత అవసరమైతే మాత్రమే సిబిఐ జగన్‌ను అరెస్టు చేస్తుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications