వెనుక గేటు నుండి సిబిఐ ఆఫీసులోకి వెళ్లిన జగన్

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు చాలా ధైర్యంగా ఉన్నారని జగన్మోహన్ రెడ్డి వర్గం కాంగ్రెసు శాసనసభ్యుడు మేకపాటి చంద్రమోహన్ రెడ్డి శుక్రవారం మీడియాతో అన్నారు. చిన్న విషయాన్ని కొందరు పెద్దదిగా చేసి చూపడం సరికాదన్నారు. మైనింగ్ లీజులు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడే కట్టబెట్టారని మరో ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి అన్నారు. గురువారం అరెస్టు అయిన కోనేరు ప్రసాద్ బాబు సన్నిహితుడే అని ఆరోపించారు. గాలి జనార్ధన్ రెడ్డి వ్యాపారాలతో జగన్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. జగన్ ఏ తప్పు చేయాలేదని ఆయన క్లీన్ చిట్‌తో తిరిగి వస్తారన్నారు.
జగన్‌పై కొందరు బురద జల్లే కార్యక్రమాన్ని అదే పనిగా పెట్టుకున్నారని మరో నేత రెహ్మాన్ అన్నారు. దేవుడి దయ వల్ల జగన్‌కు క్లీన్ చిట్ వస్తుందన్నారు. కాంగ్రెసు, టిడిపి కుమ్మక్కై జగన్‌పై బురద జల్లుతున్నాయన్నారు. ఆయన ఏ తప్పూ చేయలేదన్నారు. కావాలనే ఉద్దేశ్య పూర్వకంగా పిలిచి ఇబ్బందులు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications