రోడ్ మ్యాప్ ప్రకటించే వరకు దీక్ష: కోమటిరెడ్డి

ఓ కాంగ్రెసు కార్యకర్తగా తాను ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు దాన్ని తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి చేరవేయాల్సిన బాధ్యత పార్టీ సీనియర్లపై ఉందని ఆయన అన్నారు. ఎన్ని అవాంతారాలు ఎదురైనా తన దీక్ష సాగుతుందని, తెలంగాణ సాధించి తీరుతామని ఆయన అన్నారు. తెలంగాణ కోసం తాము చేపట్టిన పోరు ఆగదని పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీక్షా శిబిరంలో ఆయన మాట్లాడారు. హైదరాబాదును మాది అంటున్న సీమాంధ్రులపై ఆయన విరుచుకుపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత హైదరాబాదులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలో హైటెక్ సిటీ మాత్రమే వచ్చిందని, మిగతా కట్టడాలన్నీ అప్పటికే ఉన్నాయని ఆయన అన్నారు. సిగ్గు లేకుండా కొంత మంది నాయకులు సిగ్గులేకుండా ముఖ్యమంత్రి కూర్చున్నారని ఆయన అన్నారు. తెలంగాణ గురించి మాట్లాడిన నాయకులు మంత్రి పదవుల కోసం ముఖ్యమంత్రి చుట్టూ తిరుగుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణ ద్రోహులకు బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications