భరించలేం, యుపిఎ నుంచి తప్పుకుంటాం: మమతా

గత 12 నెలల్లో 11 సార్లు పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచడం అంగీకార యోగ్యం కాదని ఆమె స్పష్టం చేశారు. అంతర్జాతీయ మార్కెట్లోని ధరలు దేశంలోని ధరలను ప్రభావితం చేస్తాయనే విషయం తెలుసునని, అయితే విదేశీ మార్కెట్లో ధరలు తగ్గినప్పుడు దేశంలో పెట్రో ఉత్పత్తుల ధరలను తగ్గించడం లేదని ఆమె అన్నారు. కేంద్ర మంత్రి వర్గంలో తమ పార్టీ సభ్యుడు ఒక్కరే ఉన్నందున ప్రభుత్వం తమ మాట వినకపోవచ్చునని, అయితే తమకు పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెసు మద్దతు అవసరం లేదని, తాము సొంతంగా ప్రభుత్వన్ని నడపగలమని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications