బాబుపై జగన్ ఆరోపణలను తిప్పికొట్టిన మోత్కుపల్లి

గాలి జనార్దన్ రెడ్డి, వైయస్ జగన్ అన్నదమ్ములంటూ ఒకే తల్లి కడుపున పుట్టినట్లుగా మాట్లాడుకున్నారని, గాలి జనార్దన్ రెడ్డితో జగన్‌కు ఉన్న సంబంధాలను వారి మాటలే తెలియజేస్తాయని ఆయన అన్నారు. గాలి జనార్దన్ రెడ్డి మాదిరిగానే వైయస్ జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన అన్నారు. కనిమొళి, ఎ. రాజా, కల్మాడీలకు పట్టిన గతే వైయస్ జగన్‌కు పడుతుందని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడే గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి 64.2 ఎకరాల భూమిని బదిలీ చేయించారని జగన్ ఆరోపించిన విషయం తెలిసిందే. అలాగే, ఒఎంసి కేసులో చంద్రబాబును విచారించాలని ఆయన సిబిఐకి సూచించారు. దీనిపైనే మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు.












Click it and Unblock the Notifications