తెలంగాణ వైఖరి తీసుకున్న డిఎస్పీ నళిని సస్పెన్షన్

తెలంగాణ కోసం తాను డిజిపి కార్యాలయంలో తన రాజీనామాను సమర్పించినట్లు నళిని నవంబర్ 1వ తేదీన మీడియా ప్రతినిధులకు తెలిపారు. పోలీసు శాఖలోని సీమాంధ్ర ఉన్నతాధికారులు తనను వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. తాను తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటానని కూడా ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు డిసెంబర్ 9వ తేదీలోగా కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయకపోతే ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని కూడా ప్రకటించారు.












Click it and Unblock the Notifications