కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమాలోకి వెళ్లే ప్రమాదం

కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరున్నర కిలోల బరువు తగ్గారని వైద్యులు చెప్పారు. బిపి, షుగర్ లెవెల్స్ పడిపోయినట్లు వారు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శానససభ్యులు శుక్రవారం సాయంత్రం నల్లగొండ దీక్షా శిబిరానికి వచ్చి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీక్షకు సంఘీభావం ప్రకటించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒంటరివారు కారని, ఆయన వెంట తెలంగాణ ప్రజలు ఉన్నారని తెరాస శాసనసభ్యుడు హరీష్ రావు అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీక్షకు మద్దతుగా రేపటి నుంచి తెలంగాణ జెఎసి ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications