ప్రఖ్యాత గాయకుడు భూపేన్ హజారికా మృతి

హజారికా కవి, సంగీత కూర్పరి, గాయకుడు, నటుడు, జర్నలిస్టు, రచయిత, చిత్ర దర్శకుడిగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన కళాకారుడు. ఆయనకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, పద్మ భూషణ్ అవార్డులు వచ్చాయి. సంగీత నాటక అకాడమీ రత్న అవార్డు, అస్సాం రత్న అవార్డు లభించాయి. భూపేన్ హజారికా 1926 సెప్టెంబర్ 8వ తేదీన అస్సాంలోని సాదియాలో జన్మించారు.
తన పన్నేండేళ్ల ప్రాయంలోనే ఆయన రెండో అస్సామీ సినిమా ఇంద్ర మలాతి అనే సినిమాలో పాట పాడారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో బిఎ పూర్తి చేశారసు. రాజకీయ శాస్త్రంలో ఎంఎ పూర్తి చేశారు. హిందీ, బెంగాలీ, అస్సామీ సినిమాలకు ఆయన పని చేశారు. రుడాలీకి కూడా ఆయన పనిచేశారు.












Click it and Unblock the Notifications