తెలంగాణ మేమే ఇస్తాం, గెలిపించి తీసుకోండి: సుష్మా

కొత్త రాష్ట్రాలు అంటే ఇతర రాష్ట్రాలకు వ్యతిరేకం కాదని ఆమె అన్నారు. వేరుపడిన నాలుగు రాష్ట్రాలు ఆత్మీయంగానే ఉన్నాయని ఆమె చెప్పారు. పంజాబ్ నుంచి విడిపోయిన హర్యానా అభివృద్ధిలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని ఆమె అన్నారు పోరాటాలతోనే తెలంగాణ సాధ్యమని అమె అన్నారు. ఐక్యతతో పోరాటం సాగించాలని ఆమె సూచించారు. తెలంగాణలో అభివృద్ధి లేదని చెప్పేందుకు నల్లగొండనే ఉదాహరణ అని ఆమె అన్నారు. కృష్ణా జలాలను నల్లగొండ జిల్లాకు తరలించి ఫ్లోరైడ్ సమస్యను రూపుమాపుతామని ఆమె అన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో యుపిఎ ప్రభుత్వం తెలంగాణ బిల్లు పెడితే తాము మద్దతిస్తామని ఆమె హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications