బాబు సైకిల్ దొంగ, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్: అంబటి

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి 2004లో చేసినట్లు బాబు ఇప్పుడు పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళదామని అనుకుంటున్నారని కానీ ఎవరూ ఆయనను నమ్మే పరిస్థితి లేదన్నారు. వైయస్ పులి అయితే చంద్రబాబు నక్క అన్నారు. అవినీతికి మూలకారకుడు చంద్రబాబే అన్నారు. జగన్‌ను సిబిఐ విచారించిన విషయంలో యెల్లో మీడియా లేనిపోనివి చూపిస్తున్నారని ఆరోపించారు. జాతిపిత మహాత్మా గాంధీ, అన్నా హజారే తర్వాత బాబు అంటే జనం నమ్మాలా అని ప్రశ్నించారు. తండ్రి చనిపోయినప్పటికీ నిత్యం ప్రజల మధ్య గడుపుతున్న జగన్‌ను క్రిమినల్‌గా చిత్రీకరించడానికి కుట్ర చేస్తున్నారని విమర్శించారు.


Click it and Unblock the Notifications