సిఎం మేనేజ్‌మెంట్‌లో మంత్రులు చిక్కుకోవద్దు: జీవన్ రెడ్డి

Jeevan Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మేనేజ్‌మెంట్‌లో కాంగ్రెసు మంత్రులు చిక్కుకోవద్దని మాజీ మంత్రి జీవన్ రెడ్డి సోమవారం సూచించారు. ఆయన ఉదయం నిమ్స్‌లో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ విషయంలో కాంగ్రెసు పార్టీ నాన్చుడు ధోరణి వల్లనే కోమటిరెడ్డి దీక్ష చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కిరణ్ ఆయన దీక్ష ప్రారంభించి వారం రోజులు గడుస్తున్నప్పటికీ విరమింపజేసే ప్రయత్నం చేయకపోవడం దురదృష్టకరమన్నారు.

తెగించి పోరాడితేనే తెలంగాణ వస్తుందన్నారు. ప్రత్యేక తెలంగాణ ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రం పైనే ఉందన్నారు. 2009 డిసెంబర్ 9న చేసిన ప్రకటనకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. కాగా కోమటిరెడ్డిని పరామర్శించిన జీవన్ రెడ్డి ఆయన ఆరోగ్యం గురించి వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+