పూజారి హత్యకు దారి తీసిన ప్రేమ వ్యవహారం

దుండగులు అతనిపై దాడి చేసి గొంతు కోసి చంపేశారు. సందీప్ తల్లి, తండ్రి, సోదరిని హాస్పిటల్‌లో చేర్పించారు. సందీప్ ప్రేమికురాలు రేవతి కూడా అదే భువనేశ్వరి నగర్‌లోనే ఉంటున్నారు. ఇరు కుటుంబాలు వీరి పెళ్లికి అంగీకరించలేదు. అయినప్పటికీ ఇద్దరు పలుసార్లు గుడి వద్ద గాని మరో చోట కాని కలుసుకునే వారు. వారు నిత్యం కలుసుకొని మాట్లాడుకోవడాన్ని తెలుసుకున్న రేవతి కుటుంబ సభ్యులు ఇటీవల సందీప్ ఇంటికి వెళ్లి హెచ్చరించారు. సందీప్ తల్లి సరోజమ్మ కూడా వారి ఇద్దరి రిలేషన్‌షిప్ వ్యతిరేకించింది. సందీప్‌కు వేరే అమ్మాయిని చూడటం ప్రారంభించారు. రేవతి కుటుంబ సభ్యులు కూడా వేరే అబ్బాయి కోసం వెతకటం ప్రారంభించారు.
ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పటికీ సందీప్, రేవతిలు కలుసుకునే వారు. మరోసారి రేవతి కుటుంబ సభ్యులు సందీప్‌ను హెచ్చరించారు. అయినా వారు హెచ్చరికలను బేఖాతరు చేశారు. అనంతరం సందీప్ హత్య సంఘటన చోటు చేసుకుంది. దీంతో పోలీసులు రేవతి బంధువులను ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన జరిగినప్పటి నుండి రేవతి తల్లి కనిపించడం లేదు. రేవతి, ఆమె తండ్రి స్థానికంగా ఓ ప్రొవిజన్స్ దుకాణం నడిపిస్తున్నారు.












Click it and Unblock the Notifications