టిఆర్ఎస్‌కు జగన్ మిగిలాడు!: టిడిపి నేత పెద్దిరెడ్డి

తమ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయ అనుభవమంత వయసు లేని సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు ఆయనను విమర్శించడం విడ్డూరమన్నారు. రాష్ట్రం రాకున్నా ఫర్వాలేదు ఎన్నికలు వస్తే చాలన్న చందంగా టిఆర్ఎస్ వైఖరి ఉందన్నారు. రాజకీయ లబ్ధి కోసమే బాబుపై టిఆర్ఎస్ విమర్శలన్నారు. ఉత్తర ప్రదేశ్ విభజనకు సానుకూలంగా స్పందించిన కాంగ్రెసు ఆంధ్ర ప్రదేశ్ విషయంలో వెనుకడుకు ఎందుకు వేస్తుందని ప్రశ్నించారు. అనవసరంగా టిడిపిపై విమర్శలు చేస్తున్నారన్నారు. కేంద్రం తెలంగాణ విషయంలో నాటకాలాడుతోందన్నారు.
కెసిఆర్ మాదిరిగా తెలంగాణ కోసం టిడిపి అధ్యక్షుడు పోరాటాలు చేయలేరని మరో నేత అరికెల నర్సారెడ్డి వేరుగా అన్నారు. తెలంగాణ విషయంలో బాబు తటస్థంగా ఉన్నారన్నారు. ఫోరం మాత్రం తెలంగాణ కోసం ఉద్యమిస్తోందన్నారు. టిడిపి నుండి టిఆర్ఎస్‌లోకి వెళ్లే నేతలెవరూ లేరన్నారు. టిఆర్ఎస్‌లోకి వెళ్లడమంటే తెలంగాణకు ద్రోహం చేయడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణలో బాబు పర్యటన ఖచ్చితంగా ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications