ఆజాద్ సహా ఎవరితోనూ మాట్లాడడం లేదు: గుత్తా

Gutta Sekhender Reddy
హైదరాబాద్: తమ పార్టీ అధిష్టానానికి చెందిన పెద్దలు ఎవరితోనూ తాము మాట్లాడడం లేదని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ సహా తాము ఎవరితోనూ మాట్లాడడం లేదని ఆయన అన్నారు. సీనియర్ మంత్రి కె. జానా రెడ్డి నివాసంలో సోమవారం సాయంత్రం జరిగిన తెలంగాణ నాయకుల సమావేశానంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వారం రోజుల్లో కాంగ్రెసు స్టీరింగ్ కమిటీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని తాజా పరిణామాలపై తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఫాక్స్ ద్వారా తెలియజేసినట్లు ఆయన తెలిపారు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీక్షకు మద్దతు బాగుందని ఆయన చెప్పారు. దీక్ష విరమించాలని తాము కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరామని, అందుకు వెంకటరెడ్డి సిద్ధంగా లేరని, కఠినంగా ఉన్నారని ఆయన చెప్పారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీక్షకు నిరసనగా రేపు తలపెట్టిన నల్లగొండ జిల్లా బంద్‌ను విరమించుకున్నట్లు ఆయన తెలిపారు. తాము పార్లమెంటుకు వెళ్లేదీ లేనిదీ త్వరలో వెల్లడిస్తామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+