తెలంగాణపై ఏం చేద్దాం: సోనియా గాంధీతో ఆజాద్

మాజీ మంత్రి, పార్టీ శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆమరణ నిరాహార దీక్షపై ఆజాద్ సోనియాకు వివరించినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండుతో నవంబర్ 1వ తేదీన నల్లగొండలో ఆమరణ నిరాహార దీక్షకు దిగిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఇటీవల హైదరాబాదులోని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)లో చేర్చిన విషయం తెలిసిందే. నిమ్స్‌లో కూడా ఆయన తన దీక్షను కొనసాగిస్తున్నారు. తెలంగాణపై స్పష్టమైన ప్రకటన వచ్చేంత వరకు దీక్ష విరమించేది లేదని ఆయన మొండికేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనతో దీక్షను విరమింపజేసే విషయంపై కూడా సోనియాకు, ఆజాద్‌కు మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications