ఎన్టీఆర్ పులి, చిరంజీవి నక్క: పోలిక తెచ్చిన బాబు

ఇంపోర్టు, ఎక్స్‌పోర్టుపై ప్రభుత్వం సరియైన పద్ధతులు అవలంభించక పోవడం వల్లే నూలు పరిశ్రమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చంద్రబాబు విమర్శించారు. మీ సమస్యలను జాతీయ స్థాయిలో చర్చించే విధంగా కేంద్రం దృష్టికి తీసుకు వెళతానని చెప్పారు. రైతులకు మేలు జరిగే వరకు తాను తన పోరాటాన్ని ఆపేది లేదన్నారు. తాను రైతుల కోసమే పాదయాత్ర చేస్తున్నానని చెప్పారు. చిలకలూరిపేట మండలంలోని కమ్మరిపాలెంలోని గ్రామ శివార్లలో అడుగంటిన మంచినీటి చెరువును ఆయన పరిశీలించారు. తాగునీటి కోసం నానా పాట్లు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని స్థానికులు చెప్పడంతో బాబు ప్రభుత్వం, అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.












Click it and Unblock the Notifications