మైఖేల్ జాక్సన్ మృతికి డాక్టరే కారణం: కోర్టు తీర్పు

పూర్తిగా నిండిపోయిన కోర్టు హాలులో న్యాయమూర్తి తీర్పు వెలువరించే సమయంలో ముర్రే నుండి ఎలాంటి ప్రతిస్పందన కనిపించలేదు. జాక్సన్ తల్లి కేథరిన్, తండ్రి జో, తోబుట్టువులు రాండీ, జెర్మైన్, రేబీ మరియు లాతోయా ఆ సమయంలో కోర్టు హాలులోనే ఉన్నారు. తీర్పు వెలువడగానే జాక్సన్ తల్లిని రాండీ కౌగిలించుకుంది. ముర్రేకు నాలుగేళ్ల శిక్ష పడే అవకాశముంది. అతడి డాక్టర్ లైసెన్స్ కూడా కోల్పోనున్నాడు. తీర్పు వెలువడగానే పెద్ద సంఖ్యలో కోర్టు బయట గుమికూడిన జాక్సన్ అభిమానులు ఆనందంతో నినాదాలు చేశారు.












Click it and Unblock the Notifications