కడపలోని జగన్ పార్టీ నేత ఇంట్లో సిఐడి సోదాలు

2006 - 2009 మధ్య కాలంలో జరిగిన ఈ కుంభకోణానికి ఆయనే సూత్రధారి అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిర్వహణలో అక్రమాలతో పాటు అర్హత లేని వారికి డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. అధికారుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్న సిఐడి పలు కీలక పత్రాలు, సిడిలు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. సిఐడి అధికారులు మూడేళ్ల రికార్డులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు రుణాల కేటాయింపులో అవకతవకలపై కడప జిల్లాలోని పోరుమామిళ్లలో మాజీ చైర్మన్, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేత కృష్ణమ్మ ఇంట్లోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications