బిజెపికి శ్రీరాములు గుడ్‌బై, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ

బళ్లారి రూరల్ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేయడానికి ముందు ఆయన హైదరాబాదులోని జైలులో గాలి జనార్దన్ రెడ్డిని కలుసుకున్నారు. పార్టీకి రాజీనామా చేస్తూ ఆయన బిజెపి జాతీయాధ్యక్షుడు నితిన్ గడ్కరీకి, రాష్ట్రాధ్యక్షుడు ఈశ్వరప్పకు లేఖలు రాశారు. బలంగా ఉన్న కాంగ్రెసును బళ్లారిలో కాంగ్రెసును తుడిచిపెట్టడంలో తాను, గాలి జనార్దన్ రెడ్డి సోదరులు ఎంతగా శ్రమించింది ఆయన ఆ లేఖలో వివరించారు.
పార్టీ అభ్యర్థిగా శ్రీరాములు చేత పోటీ చేయించడానికి బిజెపి నాయకత్వం తీవ్రంగా ప్రయత్నించింది. తాను గెలిస్తే మంత్రి పదవి ఇవ్వాలని ఆయన షరతు పెట్టారు. ముఖ్యమంత్రి సదానంద్ గౌడ తనను మంత్రివర్గంలోకి తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ ఆయన ఎమ్మెల్యే పదవికి ఆగస్టులో రాజీనామా చేశారు. దాంతో బళ్లారి రూరల్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతోంది. తాను పార్టీకి ద్రోహం చేయలేదని, పార్టీకి బలాన్ని అందించానని, కానీ పార్టీ తనను పక్కన పెట్టిందని, తద్వారా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేలా చేసిందని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications