వేషము మార్చెను, చంద్రబాబు రైతు పోరు బాట

Chandrababu Naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు కొత్త గెటప్‌లో కనిపిస్తున్నారు. రైతు పోరు బాట కోసం ఆయన వేషం మార్చారు. భాష మాత్రం మారినట్లు లేదు. తలపాగా ధరించి రైతులను ఆకట్టుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. ఆయన పార్టీ కార్యకర్తలు, అభిమానులు తలపాగాల వంటివి సమర్పిస్తే ధరించినట్లే ధరించి తీసి పక్కన వేసేవారు. కానీ, ఇప్పుడు ఆయన తలపాగా తీయడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు ఓ కార్పొరేట్ సంస్థ సిఇవోగా పనిచేస్తున్న ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు ఇప్పుడు రైతు బాంధవుడిని అనిపించుకోవడానికే తలపాగా ధరిస్తున్నట్లు చెబుతున్నారు. ఆయన అనంతపురం జిల్లాలో తన పాదయాత్రను ప్రారంభించి నల్లగొండ జిల్లా వరకు వచ్చారు. కానీ తలపాగాను తీయడం లేదు.

స్వర్గీయ ఎన్టీ రామారావు ధోవతి, లాల్చీలతో తమకు దగ్గరివాడిగా రైతులకు కనిపించేవారు. ఎన్టీ రామారావు ప్రసంగాలు కూడా ఎక్కువగా ఆకట్టుకునేవి. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి అచ్చమైన పంచెకట్టుతో రైతుల మధ్యకే కాదు, అన్ని వర్గాల ప్రజల మధ్యకు వెళ్లేవారు. ఎప్పుడో గాని ఆయన సూట్ ధరించేవారు కారు. ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రైతులను విస్మరించినందువల్లనే తిరిగి అధికారంలోకి రాలేకపోయానని భావిస్తున్న చంద్రబాబు ఇప్పుడు తలపాగా ధరించి రైతులకు దగ్గర కావాలని చూస్తున్నారు. కిందనే కూర్చుని భోజనం చేస్తున్నారు. ఈ రకమైన చంద్రబాబునైనా రైతులు నమ్ముతారా అంటే ఇప్పుడే ఏమీ చెప్పలేం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+