చంద్రబాబుకు అవిశ్వాసం పెట్టే దమ్ము లేదు: కెసిఆర్

కాంగ్రెసు పార్టీ తమను మోసం చేసిందని ఆయన అన్నారు. కాంగ్రెసుకో ఖతం కరో, తెలంగాణ హాసిల్ కరో అంటూ ఉద్యమాన్ని ఉప్పెనలా నడిపిస్తామని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ రకరకాల ప్రకటనలతో తెలంగాణ ప్రజలను గందరగోళ పరుస్తోందని ఆయన అన్నారు. పదో తేదీ తర్వాత తెలంగాణపై ప్రకటన వస్తుందని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ చెప్పారని, ఆ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నామని, ప్రకటన తెలంగాణకు అనుకూలంగా లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన అన్నారు. హైదరాబాదు రాజధానిగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్సార్సీ, ప్రాంతీయ మండళ్లు వేయడం వంటి పిచ్చి ఆలోచనలను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని ఆయన హెచ్చరించారు. తెలంగాణపై పార్లమెంటు, శాసనసభలను స్తంభింపజేస్తామని ఆయన చెప్పారు.
ఈ నెల 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు తమ పార్టీ నాయకులు, శాససనసభ్యులు జిల్లాల్లో పాద యాత్రలు చేస్తారని ఆయన చెప్పారు. ఉద్యమాన్ని ఉప్పెనలా మారుస్తామని ఆయన చెప్పారు. శాసనసభ్యులు ఆమరణ నిరాహార దీక్షలు చేయాలనే ప్రతిపాదనతో పాటు బస్సు యాత్ర చేయాలనే ప్రతిపాదన కూడా సమావేశంలో చర్చకు వచ్చిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications