సోనియాకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ లేఖ

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నల్లగొండలోని క్లాక్ టవర్ వద్ద ఆయన నవంబర్ 1వ తేదీన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఐదు రోజుల తర్వాత ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను హైదరాబాదులోని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)లో చేర్చారు. నిమ్స్‌లో కూడా ఆయన దీక్ష కొనసాగించారు. అయితే, కుటుంబ సభ్యుల నుంచి, పార్టీ పార్లమెంటు సభ్యుల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతో ఆయన దీక్ష విరమించారు. ప్రస్తుతం ఆయన నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయనను గురువారం సాయంత్రం నిమ్స్ నుంచి డిశ్చార్జీ చేసే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications