సిబిఐ నన్ను మానసికంగా వేధించింది: కోనేరు ప్రసాద్

కోనేరు ప్రసాద్ విచారణలో తమకు సహకరించలేదని, మరిన్ని రోజులు తమ కస్టడీకి అప్పగించాలని సిబిఐ కోర్టుకు చెప్పుకుంది. కోనేరు ప్రసాద్ 30 కోట్ల రూపాయల లావాదేవీలను మాత్రమే వివరించారని, మరో 90 కోట్ల రూపాయల లావాదేవీల గురించి చెప్పాల్సి ఉందని సిబిఐ చెప్పింది. కోనేరు ప్రసాద్‌ను మరో ఐదు రోజుల పాటు సిబిఐ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నం మూడున్నర గంటలకు తమ ముందు కోనేరు ప్రసాద్‌ను ప్రవేశపెట్టాలని కోర్టు సిబిఐని ఆదేశించింది. కోనేరు ప్రసాద్‌కు సిబిఐ కార్యాలయంలో ఓ గదిని కేటాయించాలని కూడా కోర్టు ఆదేశించింది.












Click it and Unblock the Notifications