ఎమ్మెల్యేలను వైయస్ జగన్ అవమానించారా?

తమ పట్ల జగన్ అనుసరిస్తున్న అవమానకరమైన పద్ధతికి చాలా మంది శాసనసభ్యులు మనసు నొచ్చుకున్నట్లు చెబుతున్నారు. దీంతోనే వారు తిరిగి తమ మాతృ సంస్థ కాంగ్రెసులోకి రావాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు. పైగా, జగన్‌పై సిబిఐ దర్యాప్తుల నేపథ్యంలో తమ భవిష్యత్తుపై వారు ఆందోళనకు గురవుతున్నట్లు చెబుతున్నారు. ఈ స్థితిలోనే జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు కొంత మంది కాంగ్రెసులోకి తిరిగి వస్తారని మీడియా వార్తాకథనాలు ప్రచురించింది. తిరికి రావడానికి కొంత మంది శాసనసభ్యులు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ విప్ కొండ్రు మురళి చెప్పారు.
కాగా, ఆ వార్తలను తన వర్గానికి చెందిన శాసనసభ్యులతో ఖండింపజేసే వ్యూహాన్ని వైయస్ జగన్ ఎంచుకున్నారు. పూతలపట్టు రవి, బాబూరావు, పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ వంటి కొంత మంది శాసనసభ్యులు తాము జగన్‌తోనే ఉంటామని ప్రకటనలు ఇచ్చారు. మొత్తం మీద, జగన్ వైపు వెళ్లిన శాసనసభ్యులు అంత సౌకర్యంగా లేరనేది అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications