అరెస్టు భయంతో సెలవుపై వెళ్లిన ఐఎఎస్ శ్రీలక్ష్మి?

CBI Logo
హైదరాబాద్: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి గనుల అక్రమ మైనింగ్ కేసులో గనుల శాఖ మాజీ కార్యదర్శి శ్రీలక్ష్మికి అరెస్టు భయం పట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ఇందుకు సంబంధించిన వార్తను గురువారం సాయంత్రం ప్రసారం చేసింది. ఆ భయంతోనే ఆమె సెలవుపై వెళ్లినట్లు తెలుస్తోంది. ఆమె ప్రస్తుతం మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు ఫైళ్లు పంపవద్దని రాష్ట్ర ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు ఆ వార్తా కథనం తెలియజేస్తోంది.

గాలి జనార్దన్ రెడ్డికి గనుల లీజులు మంజూరు చేయడంలో ఆప్పటి గనుల మాజీ మేనేజింగ్ డైరెక్టర్ రాజగోపాల్, శ్రీలక్ష్మి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. గనుల కాంట్రాక్టర్ కొండా రెడ్డి ఆ ఇద్దరు అధికారులపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తనను వారిద్దరు కోట్ల రూపాయలు లంచం అడిగారని కూడా ఆయన చెప్పారు. కొండా రెడ్డి వాంగ్మూలాన్ని సిబిఐ ఇప్పటికే రికార్డు చేసింది. ఈ స్థితిలో తన అరెస్టు తప్పదనే భయంతోనే శ్రీలక్ష్మి సెలవుపై వెళ్లినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+