తెలంగాణవాదులు పిరికిపందలు: పరకాల ప్రభాకర్

తమతో చర్చకు రావాలని ఆయన తెలంగాణవాదులను సవాల్ చేశారు. విశాఖపట్నం, తిరుపతి, కరీంనగర్, వరంగల్‌ల్లో ఉమ్మడి చర్చలు పెడదామని, తమ లెక్కలు తాము చెబుతామని, తెలంగాణవాదులు వారి లెక్కలు చెప్పాలని, తాము విశాలాంధ్ర ఎందుకు కావాలో చెబుతామని, ప్రజలే ఏది సత్యమో తేల్చుకుంటారని ఆయన అన్నారు. తాము చెప్పే సత్యాలకు సమాధానాలు చెప్పలేక తమ సభలను అడ్డుకుంటున్నారని, తమ ఇళ్లపై దాడులు చేస్తున్నారని, తమ నోళ్లు నొక్కేయాలని చూస్తున్నారని ఆయన అన్నారు. జయశంకర్ చెప్పిన విషయాలన్నీ అబద్ధాలు, అసత్యాలని తాము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. హైదరాబాదులోనే తమ సభను అడ్డుకోవడానికి తెలంగాణవాదులు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications