అవిశ్వాసం పెడితే బాబుకు మద్దతు: లోక్‌సత్తా చీఫ్ జెపి

jayaprakash narayana
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెడితే తాము సంపూర్ణ మద్దతిస్తామని లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ శనివారం అనంతపురం జిల్లాలో అన్నారు. అవిశ్వాసమనేది ప్రభుత్వాన్ని పడగొట్టేందుకే కాదని విధానాలను ఎండగట్టేందుకూ వేదికగా ఉంటుందని ఆయన అన్నారు. సిటిజన్ చార్టర్‌కు చట్టబద్దతతోనే ప్రజలకు న్యాయం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. దేశంలో హద్దుల్లేని అవినీతిని అరికట్టాలంటే అవినీతిపరులను జైల్లో పెట్టడంతో పాటు వారి ఆస్తులను జప్తు చేయాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తామని చెప్పారు.

నిత్యావసర ధరలు భారీగా పెరిగినందు వల్ల రూపాయికి కిలో బియ్యంతో ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. రైతులు, చేనేత కార్మికుల సమస్యలపై ప్రభుత్వం స్పందించక పోవడం దారణమన్నారు. లోకాయుక్త బిల్లును వెంటనే ప్రవేశ పెట్టాలని కోరారు. మద్యం ఉండకూడదన్నదే తమ విధామన్నారు. సిబిఐకి స్వయం ప్రతిపత్తి కల్పిస్తేనే నిజాయితీకి తావుంటుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+