అంతా కాంగ్రెసు, టిఆర్ఎస్ నాటకం: కడియం శ్రీహరి

తెలంగాణ ప్రజలను కాంగ్రెసు మొదటి నుండి మోసం చేస్తుందన్నారు. కాంగ్రెసును ఎండగట్టడంలో టిఆర్ఎస్ పూర్తిగా విఫలమైందన్నారు. జెఏసి కాంగ్రెసుపై ఒత్తిడి పెంచకుండా వారితో కుమ్మక్కై టిడిపిని దోషిగా నిలిపే ప్రయత్నాలు చేసిందన్నారు. ప్రజలు ఇదంతా గుర్తించాలన్నారు. కాంగ్రెసు, టిఆర్ఎస్ కలిసే నాటకాలాడుతున్నాయని విమర్శించారు. సెంటిమెంటు పేరుతో టిడిపిని బలహీనపర్చి తన బలాన్ని పెంచుకునే కుట్ర టిఆర్ఎస్ చేసిందన్నారు. జెఏసి తెలంగాణ లక్ష్యాన్ని పక్కన పెట్టిందని ఇప్పటికైనా వారి వైఖరి మారాలన్నారు. జెఏసి ఇప్పటి వరకు వ్యూహాత్మక తప్పిదాలు చేసుకుంటూ వచ్చిందని మేం ఉద్యమంలో పాల్గొనడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నామన్నారు. తెలంగాణ కోసం చేసిన బలిదానాలు చూసైన అందరూ ఐక్యంగా ఉద్యమించాలని సూచించారు.












Click it and Unblock the Notifications