భయమొద్దు నేనున్నా, కాంగ్రెసుకు కెసిఆర్ శాపనార్థాలు

కాగా ప్రధాని ప్రకటనపై టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, తెలంగాణ జెఏసి చైర్మన్ కోదండరాంలు మండిపడ్డారు. ప్రధాని ప్రకటన బాధ్యతరాహిత్యమని, అన్ని వర్గాల ప్రజల మనోభావాలను ప్రధాని గౌరవించాలని టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేరు వేరుగా అన్నారు. నిర్ణయం ప్రకటించాల్సిన సమయంలో కాంగ్రెసు దొంగదారులు వెతుకుతోందన్నారు. కాంగ్రెసు నేతలు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని కొత్తగా మాట్లాడిందేమీ లేదని తెలంగాణ ఇవ్వలేమని ఆయన చెప్పలేదని కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇవ్వలేమని మాత్రమే చెప్పారని మాజీ ఎంపీ వినోద్ అన్నారు. పార్లమెంటులో చేసిన ప్రకటనకు కట్టుబడకుండా రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘించారని జెఏసి చైర్మన్ కోదండరాం అన్నారు. పూటకో మాట మారుస్తూ తెలంగాణ ప్రజలను అవమానపరుస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications