వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రా నేతల ఒత్తిడి వల్లే ప్రధాని ప్రకటన: మధుయాష్కీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Madhu Yashki
హైదరాబాద్: ఆంధ్రా ప్రాంత ప్రజాప్రతినిధుల ఒత్తిడి వల్లనే ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తెలంగాణపై వ్యతిరేక ప్రకటన చేశారని నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ ఆదివారం అన్నారు. వారి ఒత్తిడితో చేసే ఇలాంటి ప్రకటనల వల్ల కాంగ్రెసు తమను మోసం చేస్తుందేమోనన్న భావన తెలంగాణ ప్రజల్లో నెలకొందని ఆయన అన్నారు. ప్రధాని తెలంగాణ వ్యతిరేకి అన్నారు. గతంలో చిన్న రాష్ట్రాలకు సిఫార్సు చేసిన ఆయన ఇప్పుడు ఇలా మాట్లాడటం సరికాదన్నారు. ఆయన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను ఆందోళకు గురి చేస్తున్నాయన్నారు.

ప్రజల మధ్య ద్వేషం, శత్రుత్వం పెంచే ఇలాంటి ప్రకటనలు సరికాదన్నారు. తమకు తెలంగాణ విషయంలో ఇప్పటికీ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీపై నమ్మకముందని త్వరలో ఆమెను కలుస్తామన్నారు. కాంగ్రెసులోనే ఉండి పోరాటం చేస్తామన్నారు. సోమవారం కాంగ్రెసు తెలంగాణ ఎంపీలం సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.

English summary
Nizamabad MP Madhu Yashki suspected that Prime Minister Manmohan Singh make statement with Andhra leaders pressure.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X