భన్వరీ దేవి ఎఫెక్ట్: రాజస్థాన్ మంత్రివర్గం రాజీనామా

భన్వరీదేవితో ఇద్దరు కాంగ్రెసు నాయకులకు లైంగిక సంబంధాలున్నట్లు సిబిఐ నిర్ధారణకు వచ్చింది. వారిలో ఒకతను మాజీ మంత్రి. గత నెల వరకు మంత్రిగా ఉన్న మహిపాల్ మడెర్నా భన్వరీదేవితో రాసలీలలు నడుపుతున్న వీడియో వెలుగు చూసింది. భన్వరీదేవి మాయం కాగానే ఆ వీడియోను విస్తృతంగా పంపిణీ చేశారు. భన్వరీ దేవి దళితురాలు కాగా, మాడెర్నా జాట్ వర్గానికి చెందిన బలమైన నాయకుడు. గోపాల్‌గఢ్‌లో మియో ముస్లింలపై కాల్పుల సంఘటన కూడా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టింది. జాట్‌ల మాదిరిగా కాంగ్రెసుకు మియోలు మంచి ఓటు బ్యాంక్.












Click it and Unblock the Notifications