సుప్రీంకు వెళ్తే బాబు నేరాన్ని అంగీకరించినట్లే: కెటిఆర్

ముఖ్యమంత్రిగా ఉన్న కాలానికి సంబంధించే కాకుండా చంద్రబాబు రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటి నుంచి విచారణ జరుపాల్సిన అవసరం ఉంటుందని, అటువంటప్పుడు అభివృద్ధి చెందడానికి చంద్రబాబు వద్ద ఉన్న మ్యాజిక్ ఏమిటో, అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏమిటో అందరూ తెలుసుకుంటారని ఆయన అన్నారు. చంద్రబాబు పద్ధతిలో ఎదగడానికి ప్రయత్నిస్తారని ఆయన అన్నారు. చంద్రబాబు అండదండలతోనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నడుస్తోందని, కావాలనుకుంటే తమపై విచారణలు జరిపించుకోవచ్చునని ఆయన అన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆయన అన్నారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని నాలుగు విభజించాలనే ప్రతిపాదనను శాసనసభలో ప్రతిపాదించాలనే ముఖ్యమంత్రి మాయావతి నిర్ణయాన్ని ఆయన హర్షించారు. మాయావతి పద్ధతిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు రాష్ట్ర శాసనసభలో తీర్మానం ప్రతిపాదించాలని, తెలంగాణ ఏర్పాటుకు చంద్రబాబు, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ముందుకురావాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications