బూతులు తిడితే తెలంగాణ వస్తుందా: రేణుకా చౌదరి

రాష్ట్ర వి భజనను చెడగొట్టాలని, కాంగ్రెస్‌లో చీలిక తీసుకురావాలని కొందరు ఇలా అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని వ్యాఖ్యలపై ప్రశ్నించగా.. తెలంగాణ ఇవ్వబోమని ప్రధా ని ఏమీ చెప్పలేదని, ఇప్పుడే ఇస్తే ఇబ్బందులొస్తాయి కాబట్టి అందరికీ నచ్చచెప్పి నిర్ణయానికి వస్తామని మాత్రమే చెప్పారన్నారు. 'తెలంగాణ తెచ్చుకోవాలంటే పద్ధతి, విధానం ముఖ్యం. అంత మా త్రాన ఎవరూ ఓడిపోయినట్లో, గెలిచినట్లో కాదు' అని చెప్పారు. ప్రధానిని తెలంగాణ ద్రోహి అంటూ కొందరు కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించగా - మితిమీరి మాట్లాడినంత మాత్రా న హీరోలు కాబోరని వ్యాఖ్యానించారు.
కేసీఆర్ శాపాలను గురించి ప్రస్తావిస్తే - పన్నులేమీ లేవు కాబట్టే కేసీఆర్ తిడుతుంటారని వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. ముందు ఆయనేం అయిపోతారో ఆలోచించుకోవాలని హితవు పలికారు. తెలంగాణను ప్రజల కోసం తీసుకువస్తామే తప్ప కేసీఆర్ కోసం కాదని చెప్పారు. తెలంగాణ ఎప్పుడు తేలుతుందనేది చెప్పలేనన్నారు. చంద్రబాబుపై సీబీఐ విచారణను ప్రస్తావించగా - హైకోర్టు నిర్ణయంపై తానేమీ వ్యాఖ్యానించలేనన్నారు. ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, అక్రమాస్తులు ఏమీ లేవని నిరూపించుకునేందుకు బాబుకు ఇది మంచి అవకాశమని చెప్పారు.












Click it and Unblock the Notifications