చిరంజీవికి సోనియా పిలుపు, మతలబుపై చర్చ

అయితే, ఉన్నదున్నట్లుగా రావాలని చిరంజీవికి సోనియా నుంచి పిలుపు రాలేదనే మాట కూడా వినిపిస్తోంది. శస్త్రచికిత్స చేయించుకుని తిరిగి వచ్చిన తర్వాత సోనియాను చిరంజీవి కలుసుకోలేదు. పైగా, ప్రజారాజ్యం పార్టీ విలీనం ఆమె లేకుండానే జరిగిపోయింది. దీంతో చిరంజీవి వారం రోజుల క్రితం సోనియా అపాయింట్‌మెంట్ అడిగినట్లు తెలుస్తోంది. దానితోనే సోనియా రేపు బుధవారం చిరంజీవిని ఢిల్లీకి రావాలని పిలిచినట్లు సమాచారం. సోనియాను పరామర్శించడానికి మాత్రమే చిరంజీవి అపాయింట్‌మెంట్ అడిగినట్లు చెబుతున్నారు. అయినా తాజా రాజకీయ పరిస్థితులపై సోనియా చిరంజీవితో మాట్లాడే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.
చిరంజీవికి త్వరలో కేంద్రంలో మంత్రి పదవి దక్కుతుందనే ప్రచారం కూడా సాగుతోంది. దీని గురించి సోనియా చిరంజీవికి సమాచారం ఇచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు. పనిలో పనిగా తెలంగాణ అంశంపై కూడా మాట్లాడే అవకాశాలున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చిరంజీవి వ్యతిరేకిస్తున్నప్పటికీ త్వరగా సమస్యను తేల్చాలని కోరుతున్నారు. ఇదే విషయం ఆయన సోనియాకు చెప్పే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఆయన తన అభిప్రాయాలను రాహుల్ గాంధీతో పంచుకున్నారు.












Click it and Unblock the Notifications