ఏడాదిగా కాలేజ్ విద్యార్థినిపై రేప్, యువకుడి అరెస్టు

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం రంగనాథన్ ఆమెపై పలుమార్లు బలవంతంగా రేప్‌కు పాల్పడ్డాడు. ఆ తర్వాత బాధితురాలు అతనితో తన సంబంధాన్ని తెంచుకోవాలని చూసినప్పటికీ తమ మధ్య ఉన్న సంబంధాన్ని మీ తల్లిదండ్రులకు చెబుతానని ఆమెను బెదిరింపులకు గురి చేశాడు. అలా సంవత్సరం గడిచిపోయింది. అయితే ఓ సారి ఇంటి యజమానికి తన కూతురు తన ఇంటి ఫై ఫ్లోర్‌లో ఉంటున్న యువకుడితో వ్యవహరిస్తున్న తీరుపై అనుమానం కలిగింది. దీనిపై అతను తన కూతురును గట్టిగా అడిగాడు.
తాను అతనితో కొనసాగించిన సంబంధం, ఆ తర్వాత తాను అతనిని దూరం పెడతామనుకున్నా అతను బెదిరించడం ఇదంతా తండ్రికి పూసగ్రుచ్చినట్లు కూతురు చెప్పింది. తండ్రి వెంటనే స్థానిక మహిళా పోలీసు స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేశాడు. అనంతరం అమ్మాయిని పరీక్షల నిమిత్తం తిరుచ్చి ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు.












Click it and Unblock the Notifications